SSC GD Notification 2025: నిరుద్యోగ యువతకు శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, అప్లికేషన్ విధానం మరియు ఇతర ముఖ్యమైన వివరాలు ఈ కింద ఇవ్వబడ్డాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత కలిగిన మరియు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయవచ్చు.
WhatsApp Channel
Join Now
Telegram Group
Join Now
Instagram
Follow
Facebook Page
Follow
YouTube Channel
Subscribe
పోస్టుల వివరాలు:
- బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్ సంస్థల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు
- అసోం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు
- ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు
విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులు కావాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్:
- పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లకు, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెంటీమీటర్లకు తగ్గకూడదు.
వయస్సు:
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
- మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సీబీఈ పరీక్ష విధానం:
- ప్రశ్నాపత్రం 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/హిందీ అంశాలపై ప్రశ్నలు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
పరీక్షా కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్:
- విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతి
తెలంగాణా:
- హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభం: 2024 సెప్టెంబర్ 5
- దరఖాస్తుకు చివరి తేదీ: 2024 అక్టోబర్ 14
- ఎడిట్ ఆప్షన్: నవంబర్ 5, 6, 7
- పరీక్ష తేదీలు: 2025 జనవరి/ఫిబ్రవరి