NEET Re-Test 2026 Final Answer Key: నీట్ రాసిన వారికి గుడ్ న్యూస్.. ఫైనల్ ఆన్సర్ కీ విడుదల, రిజల్ట్స్ ఎప్పుడంటే?

NEET Re-Test 2026 Final Answer Key Released: నీట్ రాసిన లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ రీటెస్ట్-2026 కు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ ని అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఆన్సర్ కీ ని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని NTA వెల్లడించింది.

ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక కీ (Provisional Key) పై విద్యార్థుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాతే ఈ ఫైనల్ కీని సిద్ధం చేశారు. జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక నీట్ రీ-ఎగ్జామ్‌కు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

4 మార్కులు ఉచితం.. NTA కీలక నిర్ణయం!

ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన క్రమంలో NTA ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక కీ లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత, మొత్తం 4 ప్రశ్నలను ఫైనల్ కీ నుండి తొలగించినట్లు (Dropped) సమాచారం. NTA నిబంధనల ప్రకారం.. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ ఈ ప్రశ్నలకు సంబంధించి పూర్తి మార్కులు (+4 Marks) యాడ్ కానున్నాయి. దీనివల్ల చాలా మంది విద్యార్థుల స్కోర్ పెరిగే అవకాశం ఉంది.

నీట్ రీటెస్ట్ ఫలితాలు (NEET Re-Test Results 2026) ఎప్పుడు?

ఫైనల్ ఆన్సర్ కీ విడుదల కావడంతో ఇక అందరి కళ్లు నీట్ ఫలితాలపైనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. NTA ఈ నీట్ రీ-టెస్ట్ ఫలితాలను జులై 20 లోపు విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఫలితాల విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నీట్ రీటెస్ట్ ఫైనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

# ముందుగా NTA అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లేదా nta.ac.in ఓపెన్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

# హోమ్‌పేజీలో కనిపించే “NEET UG 2026 Final Answer Key PDF” లింక్‌పై క్లిక్ చేయండి.

# మీ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వండి.

# స్క్రీన్‌పై మీ కోడ్‌కు సంబంధించిన ఆన్సర్ కీ PDF ప్రత్యక్షమవుతుంది.

# దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీ మార్కులను సరిచూసుకోండి.

  1. 👉 NEET రీటెస్ట్ ఫైనల్ ఆన్సర్ కీ డైరెక్ట్ లింక్: click here

Leave a Comment

WA Channel Telegram YouTube Insta