వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 19 నాటికి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఈ అవకాశాలు సీకే దిన్నె, ముద్దనూరు, కమలాపురం, చాపాడు, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, కడప-1, పోరుమామిళ్ల, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు తదితర ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 17, 2024
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 28, 2024
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం: జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కడప
చిత్తూరు జిల్లాలో 55 ఖాళీలు:
10వ తరగతి పాస్ అయితే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే, వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. చిత్తూరు కలెక్టరేట్ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు అర్హత కలిగిన మరియు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఐసీడీఎస్ పీడీ నాగశైలజ సూచించారు.
ఆమె విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా ఐసీడీఎస్ శాఖ పరిధిలో:
అంగన్‌వాడీ కార్యకర్తలు: 6
మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు: 12
అంగన్‌వాడీ సహాయకులు: 37
ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఖాళీల వివరాలు సీడీపీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
దరఖాస్తు సమాచారం:
అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో నివసిస్తున్న స్థానిక వివాహిత మహిళలు, పదవ తరగతి పాసైన వారు రోస్టర్ ప్రకారం సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
IOCL Apprentice Recruitment 2026: ప్రభుత్వ రంగ సంస్థలో Apprenticeship చేయాలనుకునే నిరుద్యోగులకు Indian Oil Corporation Limited (IOCL) మంచి అవకాశం తీసుకొచ్చింది.…
AP DSC Notification 2026:ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. AP DSC 2026 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న…